TS Police Jobs:- అప్లికేషన్ ప్రాసెస్‌లో ముఖ్యమైన అంశాలు
TS Police Jobs | తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు (TSLPRB) సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై పది రోజులు అవుతుంది. ఉద్యోగార్థుల నుంచిఈ పదిరోజుల్లోనే లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్కు సంబంధించి ముఖ్యమైన విషయాలు..
తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు (TSLPRB) సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై పది రోజులు అవుతుంది. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 20న రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు ఉంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన పదిరోజుల్లోనే 3,52,433 అప్లికేషన్లు వచ్చాయి. చివరి రోజుల్లో దరఖాస్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ బోర్డు భావిస్తోంది.
Step 1 – ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ లోకి వెళ్లాలి
Step 2 – కుడి వైపు పైన Apply Online ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
Step 3 – Have you already Registered ? అని కనిపిస్తుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకొనే వారు NO క్లిక్ చేయాలి.
Step 4 – అనంతరం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.
Step 5 – పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇవి ఒక్కసారి ఇస్తే మారవు.
Step 6 – అనంతరం మొబైల్, ఈమెయిల్‌కు ఓటీఈ వస్తుంది. అది సబ్మిట్ చేసి ధ్రువీకరించుకోవాలి.
Step 7 – తరువాత మొబైల్ నంబర్, పాస్వర్డ్ సెట్ చేసుకొని సైన్ ఇన్ కావాలి.
Step 8 – తరువాత మీరు ఏ విభాగాన్ని ఎంచుకొంటున్నారో క్లిక్ చేయాలి.
Step 9 – అనంతరం ఫీజు చెల్లించాలి.
Step 10 – తరువాత విద్యా, కుటుంబ, కమ్యూనిటీ, అడ్రస్ వివరాలును తప్పులు లేకుండా నింపాలి.
Step 11 – అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
పోలీసు ఉద్యోగాలకు మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ (TS Police Jobs Selection Process) ఉంటుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ, దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్ లో సత్తా చాటిన అభ్యర్థులకు ఉద్యోగం లభిస్తుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్:
మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 మార్కులు ఉంటాయి. జనరల్ స్టడీస్‌కు (GS) కు సంబంధించి మరో 100 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం 30శాతం మార్కులు సాధించిన వారు క్వాలిఫై అవుతారు. వారు తర్వాత నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ, దేహ దారుడ్య పరీక్షలకు ఎలిజిబిలిటీని పొందుతారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతి పొందుతారు.
ఫైనల్ ఎగ్జామ్..
సివిల్ కానిస్టేబుల్, ఫైర్‌మన్, వార్డర్ (పురుష, మహిళ) అభ్యర్థులు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ విభాగాల అభ్యర్థులు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఎస్ఐ జాబ్స్ కు..
సివిల్ ఎస్సై, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ అభ్యర్థులకు 4 పేపర్లలో 600 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏఆర్ ఎస్సై, టీఎస్ఎస్పీ ఎస్సై, ఎస్పీఎఫ్ ఎస్ఐ అభ్యర్థులు 400 మార్కులకు నాలుగు ఎగ్జామ్స్ రాయల్సి ఉంటుంది.