10th Class Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎంపిక విధానం, జీతం, ఇతర వివరాలిలా..
ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయం ‘ఆర్మీ మెడికల్ కార్ప్స్ యూనిట్’లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇండియన్ ఆర్మీకి(Indian army) చెందిన సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయం ‘ఆర్మీ మెడికల్ కార్ప్స్ యూనిట్’లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నుండి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. కాగా, ఈ నెల ప్రారంభంలోనే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అస్సాం(Assam), మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh), మిజోరాం(Mizoram), నాగాలాండ్(Nagaland), త్రిపుర(Tripura), సిక్కిం(Sikkim), జమ్మూ కాశ్మీర్‌లోని లడక్ సబ్ డివిజన్లోని అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు గడువు 52 రోజుల వరకు ఉంటుంది. అభ్యర్థులు మొత్తం 55 గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో 12 బార్బర్ పోస్టులు, 43 చౌకీదార్ పోస్టులు ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు
గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. బార్బర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. చౌకీదార్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 1 సంవత్సరం అనుభవంతో పాటు సంబంధిత ట్రేడ్‌కు సంబంధించిన విధులపై అవగాహన కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం
స్టెప్-1: నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫారంను ఫ్రింట్ తీసుకోండి.
స్టెప్-2: అప్లికేషన్ ఫారంలో వివరాలను జాగ్రత్తగా నింపండి.
స్టెప్-3: అవసరమయ్యే డాక్యుమెంట్స్‌పై సంతకం చేసి, అప్లికేషన్ ఫారంతో జత చేయండి. అలాగే సెల్ఫ్- అడ్రస్‌ను ఎన్వలప్‌తో అటాచ్ చేయండి. కమాండింగ్ ఆఫీసర్, 4012 ఫీల్డ్ హాస్పిటల్ పేరుతో రూ. 100 రుసుము పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించాలి. అలాగే రెండు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను కూడా చేర్చాలి.
స్టెప్-4: దరఖాస్తు ఫారమ్‌తోపాటు ఇతర డాక్యుమెంట్స్ ఉన్న ఎన్వలప్‌ను పోస్ట్ ద్వారా ఇచ్చిన చిరునామాకు పంపండి.
* పరీక్ష విధానం
అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్నలు ఉండే నాలుగు పేపర్లు ఉంటాయి. అభ్యర్థులకు పరీక్ష రాయడానికి రెండు గంటల సమయం కేటాయిస్తారు. పేపర్-Iలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, పేపర్-IIలో జనరల్ అవేర్నెస్పై ప్రశ్నలు ఉంటాయి. పేపర్-III అండ్ పేపర్-IV వరుసగా జనరల్ ఇంగ్లిష్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. పేపర్-I , పేపర్-IVలో 25 చొప్పున ప్రశ్నలు ఉండనున్నాయి. పేపర్-II, పేపర్-IIIలో 50 ప్రశ్నలు ఉంటాయి.
* జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ L-1 ప్రకారం జీతం ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు హెచ్‌క్యూ సదరన్ కమాండ్‌లోని ఏదైనా AMC (ఆర్మీ మెడికల్ కార్ప్స్) యూనిట్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు.